ప్రముఖ సినీ నటి రాధికా శరత్‌కుమార్ జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. కుటుంబ సభ్యులు గత నెల 28న ఆమెను చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల్లో రాధికకు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెకు ప్రత్యేక వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. రాధిక ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఇంకా కొన్ని రోజులు చికిత్స కొనసాగించాల్సి ఉంటుందని, ఈ నెల 5 తర్వాతే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. రాధిక త్వరగా కోలుకోవాలని అభిమానులు, సహచరులు ప్రార్థనలు చేస్తున్నారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు, సీరియల్స్‌లో నటించి రాధిక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవంతమైన టీవీ సీరియల్ నిర్మాతగా కూడా పేరుపొందారు. అలాగే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాధిక తెలుగులో చిరంజీవితో కలిసి 15కు పైగా సినిమాల్లో జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Read More : దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు సమన్లు

One thought on “డెంగ్యూతో ఆసుపత్రిలో రాధికా శరత్‌కుమార్”
Comments are closed.