హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్‌లో ఎంజాయ్ చేద్దామని యువకుడిని పిలిచి, అతడిని కిడ్నాప్ చేసిన బంజారా హిల్స్‌కు చెందిన బార్ డాన్సర్, ఆమె భర్తతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రకారం, బంగారు ఆభరణాల షాపులో పనిచేస్తున్న యువకుడిపై దంపతులు స్కెచ్ వేసి, మద్యం మత్తులో ఉన్న సమయంలో అతడిని పబ్‌కు పిలిపించి కిడ్నాప్ చేశారు. అనంతరం యువకుడి నగ్న వీడియోలను తీసి, డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు.
డబ్బులు ఇవ్వలేదని బాధితుడిని వేధించడంతో అతడు ఒక దశలో వారి నుండి తప్పించుకొని నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు బార్ డాన్సర్, ఆమె భర్తతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగగా, మరిన్ని వివరాలు పోలీసులు దర్యాప్తులో వెల్లడించనున్నారు.
Read More : సరోగసి కేసులో డాక్టర్ నమ్రత స్పందన

One thought on “పబ్‌కు పిలిచి యువకుడిని కిడ్నాప్ చేసిన బార్ డాన్సర్”
Comments are closed.