హైదరాబాద్: సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో ఎన్నో దారుణాలు జరిగిన సంగతి ఇటీవల బయటపడ్డాయి. దీంతో ఫెర్టిలిటీ సెంటర్ లపై అపనమ్మకం పెరుగుతోంది. కాగా, సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రతను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ2 జయకృష్ణ, ఏ6 ల పోలీసు కస్టడీపై వాదనలు కొనసాగుతున్నాయి. సంతానం లేని ఎంతోమంది మహిళలు సంతానం కోసం ఈ సెంటర్లలో లక్షలకు లక్షలు పోసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు..సృష్టి బాగోతం బయటపడడంతో ఈ సెంటర్లపై నమ్మకం సన్నగిల్లుతోంది.
Read More : నటి కల్పికకు హైకోర్టులో ఊరట
