తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్‌గా రాణిస్తున్న అభిషేక్, తన జట్టు సహచరుడు ట్రావిస్ హెడ్‌ను వెనక్కి నెట్టి నెంబర్‌వన్ స్థానాన్ని సాధించడం విశేషం.
ప్రస్తుతం ట్రావిస్ హెడ్ ఖాతాలో 814 పాయింట్లు ఉండగా, అభిషేక్ 829 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో హెడ్ పాల్గొనకపోవడం అతని ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది.
24 ఏళ్ల అభిషేక్ శర్మ ఇప్పటివరకు 17 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 535 పరుగులు సాధించాడు. వీటిలో 2 శతకాలు, 2 అర్ధశతకాలు ఉండడం అతడి దూకుడు ఆటతీరుకు నిదర్శనం. ముఖ్యంగా 193.84 స్ట్రయిక్‌రేట్‌తో అతని బ్యాటింగ్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
Read More : ఓవల్‌లో గంభీర్–క్యూరేటర్ వాగ్వాదం: కోటక్ స్పందన
