వరద నియంత్రణ చర్యలు వేగవంతం

నాగార్జునసాగర్ జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరడంతో నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు జలాశయం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

నీటి విడుదల కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి పరిస్థితులు, వరద నియంత్రణ చర్యలపై అధికారులు మంత్రులకు వివరాలు అందించారు.

అధికారులు మాట్లాడుతూ, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో వరద ప్రవాహం కొనసాగుతుందని, పరిస్థితులను పరిశీలిస్తూ నీటి మట్టం నియంత్రణలో ఉంచేందుకు అవసరమైన మేర గేట్లను ఎత్తుతున్నామని తెలిపారు. వరద పరిస్థితులపై నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు కూడా వెల్లడించారు.

Read More : కోదాడలో వివాహిత హంగామా – ప్రేమా?