హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ ముస్లిం మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆరోపణల ప్రకారం, స్థానిక టీడీపీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం నుండి తనను తొలగించడంతో పాటు, తిరిగి ఉద్యోగం కావాలంటే అనుచితంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై స్థానిక సీఐకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
“బాలకృష్ణ ఇంట్లో ఆడబిడ్డకు ఇలా జరిగితే ఊరుకుంటారా? నాకు న్యాయం చేయండి” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, న్యాయం కోసం అధికారులను వేడుకున్నారు. ఈ ఘటన హిందూపురంలో కలకలం రేపింది.

One thought on “హిందూపురంలో ముస్లిం మహిళపై వేధింపులు – టీడీపీ నేతలపై ఆరోపణలు”
Comments are closed.