భటిండా జలపాతంలో సెల్ఫీ మోజు – కుటుంబం ప్రమాదంలో

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ సమీప భటిండా జలపాతం వద్ద సెల్ఫీ మోజు పెద్ద ప్రమాదానికి దారితీసింది. పశ్చిమ బెంగాల్‌లోని పూర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం నిన్న జలపాతం సందర్శనకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకుంది. వివరాల ప్రకారం, నలుగురు సభ్యుల కుటుంబం జలపాతం వద్ద సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక మహిళ కాలు జారి నీటిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు భర్త, కొడుకు, కూతురు వెంటనే నీటిలోకి దూకారు. అయితే బలమైన ప్రవాహం కారణంగా నలుగురూ మునిగిపోయారు.

సమీపంలో ఉన్న స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై నీటిలోకి దూకి వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం నుంచి బయటపడిన కుటుంబ సభ్యులను వెంటనే సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

భటిండా జలపాతం వద్ద ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2024 ఆగస్టులో కూడా సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు వ్యక్తులు నీటిలో కొట్టుకుపోయిన ఘటన చోటుచేసుకోగా, స్థానికుల చాకచక్యంతో వారు రక్షించబడ్డారు.

Read More : తమిళనాడులో బాంబు బెదిరింపు కలకలం

One thought on “భటిండా జలపాతంలో సెల్ఫీ మోజు – కుటుంబం ప్రమాదంలో

Comments are closed.