బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇంటికి పెద్ద ఎత్తున ఐపీఎల్ అధికారుల రాక సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాంద్రాలోని ఆమిర్ నివాసానికి బస్సులు, వ్యాన్లలో సుమారు 25 మంది అధికారులు రావడం ఆసక్తికరంగా మారింది. ఈ దృశ్యాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతమంది అధికారులు ఒకేసారి ఆమిర్ ఇంటికి రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంపై స్పష్టత కోసం ఓ ఆంగ్ల మీడియా ఆమిర్ టీమ్‌ను సంప్రదించగా, వారికి కూడా ఖచ్చితమైన సమాచారం అందలేదని, వివరాలు సేకరిస్తున్నామని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
కొన్ని కథనాల ప్రకారం, అధికారులు ఆమిర్‌ను కలవడం కోసమే వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఆమిర్ త్వరలోనే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొననున్న విషయం తెలిసిందే. ఈ అంతర్జాతీయ వేదికపై ఆయన నటించిన “తారే జమీన్ పర్” చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నారు.
Read More : భటిండా జలపాతంలో సెల్ఫీ మోజు – కుటుంబం ప్రమాదంలో

One thought on “ఆమిర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపీఎల్ అధికారులు”
Comments are closed.