రష్యాలో ఘోర విమాన ప్రమాదం – ? మంది మృతి

రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అంగారా ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానం రష్యా–చైనా సరిహద్దు వద్ద కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని మొత్తం 49 మంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో ఐదుగురు చిన్నారులు సహా 43 మంది ప్రయాణికులు, ఆరుగురు క్రూ మెంబర్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

విమాన శకలాలను శోధన బృందాలు గుర్తించాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదే ప్రాంతంలో గతేడాది ఒక హెలికాప్టర్ కూడా అదృశ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సిందే. ఘటనపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Read More : 49 మందితో కుప్పకూలిన అంగారా ఎయిర్‌లైన్స్ విమానం

One thought on “రష్యాలో ఘోర విమాన ప్రమాదం – ? మంది మృతి

Comments are closed.