అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు ?

అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ భారీ దాడులు చేపట్టింది. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఏకకాలంలో 40కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు జరిపారు.

సోదాలు కొనసాగుతున్న ప్రాంతాల్లో అనిల్ అంబానీకి చెందిన అనుబంధ సంస్థల ఆఫీసులు, సంబంధిత వ్యక్తుల నివాసాలు ఉన్నాయి. ఈ చర్యల ద్వారా రుణాల దుర్వినియోగంపై ఆధారాలు సేకరించాలనే లక్ష్యంతో ఈడీ ముందుకు సాగుతోంది. అనిల్ అంబానీపై నమోదు చేసిన కేసుల్లో ఇది కీలక దశగా అధికారులు భావిస్తున్నారు. ఈ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో అనిల్ అంబానీ స్పందన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ చర్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Read More : Photos : గుజరాత్‌లో అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

One thought on “అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ దాడులు ?

Comments are closed.