అతనికి 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పా? సుప్రీంకోర్టు ఆశ్చర్యం

ఢిల్లీ: ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్ ముందస్తు బెయిల్ కు 49 పేజీలతో రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ సమయంలోనే ఉన్నత న్యాయస్థానం మొత్తం కేసు విచారణ, ‘మినీ ట్రయల్’ జరిపినట్లు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అగ్నిమాపకదళం డీజీగా సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ దాఖలైన కేసులో ఏపీ హైకోర్టు గతంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది.

అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా సంజయ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పు ఇవ్వడాన్ని చూసి ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. కేసుకు సంబంధించిన ఒప్పంద పత్రం, ఇన్వాయిస్ లను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.

Read More : Photos : గుజరాత్‌లో అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

One thought on “అతనికి 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పా? సుప్రీంకోర్టు ఆశ్చర్యం

Comments are closed.