రానాకు మరోసారి ఈడీ నోటీసులు .?

బెట్టింగ్ యాప్స్ కేసులో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు (మంగళవారం) ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉన్న రానా, వ్యక్తిగత కారణాలతో సమయం కోరడంతో అధికారులు ఆగస్టు 11న హాజరు కావాలని ఆదేశించారు.

ఈడీ ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సినీ ప్రముఖులను ప్రశ్నించగా, రానా దగ్గుబాటి కూడా విచారణకు హాజరుకావాలని పిలుపునిస్తోంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Read More : ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిత్యా మీనన్

One thought on “రానాకు మరోసారి ఈడీ నోటీసులు .?

Comments are closed.