నెల్లూరులో ఆర్టీసీ బస్సు దొంగతనం – దొంగ పట్టుబడ్డాడు

నెల్లూరులో ఏకంగా ఆర్టీసీ బస్సు దొంగతనం చేసిన ప్రబుద్ధుడు పోలీసుల చెరలో చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే, ఆత్మకూరు బస్ స్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ బస్సును పార్క్‌ చేసి రాత్రి విశ్రాంతి కోసం రెస్ట్‌రూమ్‌లో నిద్రపోయాడు. తెల్లవారుజామున లేచి చూసేసరికి బస్సు కనిపించకపోవడంతో డ్రైవర్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే డిపో అధికారులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, మార్గంలో ఉన్న టోల్‌గేట్ల వివరాలు సేకరించి వేట ప్రారంభించారు. చివరికి నెల్లూరు పాలెం సర్కిల్‌ వద్ద ఆ బస్సును గుర్తించి, దొంగను పట్టుకున్నారు. అతడిని విచారించగా, బస్సును దొంగలించి వేరే ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్‌ వేసినట్లు తెలిసింది.

ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది. సాధారణంగా చిన్నచిన్న వాహనాల దొంగతనాలు జరుగుతుంటే, ఏకంగా ఆర్టీసీ బస్సు దొంగతనం జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం దొంగను పోలీసులు రిమాండ్‌కు తరలించగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Read More : నెల్లూరులో డీఆర్‌సీ సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది