ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిత్యా మీనన్

నిత్యా మీనన్ ఎంత సహజ నటో మనందరికీ తెలుసు.సెలక్టివ్ సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు నటి నిత్యా మీనన్. ప్రస్తుతం ఆమె నటించిన ‘సార్ మేడమ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రపంచంలో ప్రతిఒక్కరికీ ప్రేమ వివాహం చేసుకోవడం సాధ్యం కాదన్నారు.

నిత్యా మాట్లాడుతూ… ప్రేమ గురించి ఎన్నో సంవత్సరాల క్రితం ఆలోచించాను. ఇప్పుడు దానికి నా జీవితంలో అధిక ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం కారణంగా సోల్మేట్ ఉండడం అనివార్యమని గతంలో అనిపించేది. అతడిని వెతికిన సందర్భాలూ ఉన్నాయి. అయితే మనం వేరేరకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని తర్వాత అర్థం చేసుకున్నాను. ప్రతిఒక్కరికీ ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా చేసుకోవడం సాధ్యం కాదు కదా! రతన్ టాటా కూడా వివాహం చేసుకోలేదు. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే.. అది జరిగినా.. జరగకపోయినా మార్పు ఉండదు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ, స్వేచ్చగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే నేను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాను. ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకుసాగాలి అన్నారు.

ప్రస్తుతం నిత్యా మీనన్ ‘సార్ మేడమ్’ తో పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల విడుదలైన దీని ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఓ మధ్యతరగతి కుటుంబంలోని భార్యాభర్తల పాత్రల్లో నిత్యామీనన్, విజయ్ సేతుపతి ఎంతో సహజంగా నటించారంటూ, వారి కెమిస్ట్రీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Read More : మోహన్‌బాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు

One thought on “ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిత్యా మీనన్

Comments are closed.