ఏపీలో జిల్లాల పేర్ల మార్పుపై కమిటీ

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, మండలాల పేర్ల మార్పులపై కీలక చర్య తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా ఒక ఉపసంఘాన్ని నియమించింది. జిల్లాల పేర్లను మార్చాలన్న ప్రజల నుంచి వచ్చిన వినతులు, చరిత్రాత్మక, సాంస్కృతిక అంశాలు, స్థానికుల అభిప్రాయాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పేర్ల మార్పులపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన సంగతి తెలిసిందే.

ఈ అంశంపై సదరు మంత్రివర్గ ఉపసంఘం సమగ్రమైన అధ్యయనం చేసి, సంబంధిత నివేదికను త్వరలో సీఎం చంద్రబాబు నాయుడుకి సమర్పించనుంది. జిల్లా పేరు మార్పులతో ప్రజల అభిలాషలు నెరవేర్చడమే కాకుండా, ప్రాంతీయ గౌరవానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయం రాష్ట్ర పాలనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Read More : వైసీపీ మాజీ మంత్రి రోజా విమర్శల మోత..