ఆదిలాబాద్ జిల్లా వర్తమన్నూర్ గ్రామానికి చెందిన నలువల ఆకాశ్ అనే ఆర్మీ జవాన్ శిక్షణలో దురదృష్టవశాత్తూ మృతి చెందాడు. మరో 15 రోజుల్లో శిక్షణ పూర్తి కానున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అస్సాం రైఫిల్స్‌లో ఆరు నెలల క్రితం ఎంపికైన ఆకాశ్, శిక్షణలో భాగంగా రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా డీహైడ్రేషన్ కారణంగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆకాశ్ అకాల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారత సైన్యంలో సేవ చేయాలని ఆకాంక్షించిన యువజవాన్ మరణం అందరికీ కలిచివేసింది.
Read More : రైలు పట్టాలపై రీల్స్ షాక్..
