ఓటరు జాబితాలో నకిలీ ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపట్టినట్లు ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. దీనివల్ల ఓటర్లకు ఎలాంటి నష్టం కలగదని, ఆందోళన అవసరం లేదని ఈసీ పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఈసీ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. బీహార్ ఓటర్ల జాబితాలో మార్పులు చేసి బీజేపీకి లాభం చేకూర్చేలా చర్యలు తీసుకున్నారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఈసీ ఖండించింది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చిత్రీకరిస్తున్నాయని కూడా ఈసీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ప్రత్యేక సవరణ వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే, ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాట్లాడుతూ, ఓటర్ల గుర్తింపు కోసం ఆధార్, రేషన్ కార్డు, లేదా ఈసీ జారీ చేసిన అధికారిక ఐడీ పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై మరింత విచారణ జరగాల్సిన నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
Read More : 158 ఏళ్ల కంపెనీకి బలహీనమైన పాస్‌వర్డ్‌తో ముప్పు.
