శ్రీశాంత్ కూతురు మాటలకు కన్నీటి పర్యంతమైన హర్భజన్ సింగ్

ఐపీఎల్ తొలి సీజన్‌లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌కు చెంపదెబ్బ కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. దాదాపు 17 ఏళ్ల కాలం గడిచిన తర్వాత కూడా ఆ సంఘటన తనను వెంటాడుతూనే ఉందని హర్భజన్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌లో హర్భజన్ మాట్లాడుతూ… “అప్పుడు అలా చేయకూడదని అనుకున్నాను. శ్రీశాంత్‌ను తిడితే సరిపోయేదే కానీ, చెంపదెబ్బ తగిలించడాన్ని నేటికీ మానసికంగా మోసుకుపోతున్నాను. ఇప్పటి వరకూ 200 సార్లు సారీ అన్నానేమో” అని చెప్పారు. ఒక సందర్భంలో శ్రీశాంత్ కుమార్తెను కలిసినపుడు తాను ప్రేమగా మాట్లాడాలని భావించానని, కానీ ఆ చిన్నారి మాత్రం “మా నాన్నను కొట్టావు.. నీతో మాట్లాడను.. పో” అని చెప్పిందని చెప్పారు. ఆ మాటలు తన హృదయాన్ని తాకాయని, ఆ పాప మాటలకు తన కళ్లు చెమర్చాయని తెలిపారు.

“ఆ చిన్నారి నన్ను దుర్మార్గుడిగా చూడడం బాధ కలిగించింది. నేను చేసిన తప్పు. భవిష్యత్తులో ఆమె నా గురించి అలా భావించకుండా చూడాలనుకుంటున్నాను. ఒక మంచి అంకుల్‌గా ఆమెకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాను” అని హర్భజన్ హృదయపూర్వకంగా తెలిపారు.

ఇటీవల శ్రీశాంత్‌తో జరిగిన వివాదాన్ని మరొకసారి చర్చకు తెచ్చుకుంటూ, తాను గతంలో చేసిన తప్పును పునరావృతం చేయనని, అవకాశముంటే ఆ సంఘటనను తన జీవితాన్నుంచి పూర్తిగా తొలగించాలనుకుంటున్నానని హర్భజన్ చెప్పారు.

Read More : క్రికెట్‌-ఫుట్‌బాల్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో

One thought on “శ్రీశాంత్ కూతురు మాటలకు కన్నీటి పర్యంతమైన హర్భజన్ సింగ్

Comments are closed.