2006 ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు

2006 జూలై 11న ముంబై సబర్బన్ రైళ్లలో జరిగిన భీకర బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా స్పెషల్ కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. సదరు పేలుళ్లు ఖార్ రోడ్, బాంద్రా, జోగేశ్వరి, బోరివలి, మాతుంగా, మీరా రోడ్, మహిమ్ జంక్షన్ స్టేషన్లలో 2006 జూలై 11 సాయంత్రం 6:24 నుంచి 6:35 గంటల మధ్యలో చోటుచేసుకున్నాయి. ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్లలో జరిగిన ఈ పేలుళ్లలో 188 మంది మరణించగా, 800 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో 2015లో ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేల్చింది. వారిలో ఏడుగురికి మరణశిక్ష, ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. అయితే, తాజా తీర్పులో హైకోర్టు డివిజన్ బెంచ్‌ అయిన జస్టిస్ ఎస్.ఎస్. షిండే, జస్టిస్ మనీష్ పిటాలేలు… ప్రత్యేక కోర్టు తీర్పును రద్దు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రాసిక్యూషన్ ఈ కేసులో నిందితులపై ఆరోపణలు నిరూపించడంలో పూర్తిగా విఫలమైందని, విచారణలో సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోయిందని, దర్యాప్తులోనూ పలు లోపాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అందువల్ల నిందితులు ఈ పేలుళ్లకు సంబంధించి పాత్రలు పోషించలేదని హైకోర్టు స్పష్టం చేసింది.

దాదాపు రెండు దశాబ్దాల పాటు జైలు జీవితం గడిపిన ఈ 12 మంది నిందితులకు తాజాగా న్యాయస్థానం తీర్పు ఊరటనిచ్చింది. వారి కుటుంబాలకు ఇది ఒక గొప్ప ఆనందకారణమని అనిపిస్తోంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read More : నేటి నుంచి వర్షాకాల సభలు

One thought on “2006 ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు

Comments are closed.