హరిహర వీరమల్లు టికెట్ ధరలకు ఏపీ గ్రీన్‌సిగ్నల్

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

చిత్ర నిర్మాత ఏ.ఎం. రత్నం చేసిన విజ్ఞప్తి మేరకు 14 రోజుల పాటు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఆ విజ్ఞప్తిని పూర్తిగా మంజూరు చేయకుండా… ప్రభుత్వం 10 రోజుల పాటు మాత్రమే టికెట్ ధర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇలాంటి నిర్ణయంతో అన్ని సినిమాలకు సమాన న్యాయం జరుగుతుందని సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈసారి టికెట్ ధరల విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా చర్యలు తీసుకోవడం విశేషం. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఇక సినిమా విషయానికి వస్తే, ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలకానున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. పవన్ కళ్యాణ్ యోధునిగా నటిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగే కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మార్చి 28న విడుదల కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల జూలై 24న థియేటర్లలోకి రానుంది.

Read More : సీఏలే దేశ ఆర్థిక వ్యూహం వెన్నెముక: నారా లోకేశ్‌

One thought on “హరిహర వీరమల్లు టికెట్ ధరలకు ఏపీ గ్రీన్‌సిగ్నల్

Comments are closed.