బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ‘కింగ్’ సినిమా షూటింగ్‌లో గాయపడినట్టు సమాచారం. డూప్ లేకుండా ఓ యాక్షన్ సన్నివేశాన్ని స్వయంగా చేయడానికి ప్రయత్నించే సమయంలో షారుక్ గాయపడినట్టు తెలిసింది. ఈ సంఘటనతో చిత్రీకరణ తాత్కాలికంగా నిలిపివేశారు. తన బృందంతో కలిసి చికిత్స కోసం షారుక్ ఖాన్ అమెరికా వెళ్లినట్టు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. గాయం తీవ్రతపై ఇంకా అధికారిక సమాచారం విడుదల కానప్పటికీ, అది పెద్ద ప్రమాదం కాదని.. కండరాలకు సంబంధించిన గాయమేనని ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఈ గాయంతో ‘కింగ్’ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్‌కి వాయిదా వేసినట్టు సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్నారు. ఇందులో షారుక్ కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆమె తల్లి పాత్రలో రాణీ ముఖర్జీ నటిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. గాయ ఘటన చిత్రబృందానికి తీవ్ర ఇబ్బందిగా మారింది. అభిమానులు షారుక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Read More : అన్న అంటే నీలా ఉండాలి.. ఎమోషనలైన ఆనంద్ దేవరకొండ

One thought on “బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు ‘కింగ్’ సినిమా షూటింగ్‌లో గాయం”
Comments are closed.