రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ డమ్’. ఇప్పటికే ఈ సినిమా మంచి హైప్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్, మాస్ యాక్షన్, ఎమోషనల్ కథాంశాలతో ప్రేక్షకుల మనసు దోచిన విజయ్, ఈసారి తన దృష్టిని పూర్తిగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా వైపు మళ్లించారు. ఈ సినిమాతో ఆయన తన కెరీర్ లో కొత్త పేజీ తెరుస్తారని టాక్. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ‘అన్న అంటేనే..’ అనే పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. అన్నదమ్ముల అనుబంధాన్ని స్పృశించే ఈ పాటను చూసి విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో విజయ్ తో కలిసి ఉన్న తమ చిన్నప్పటి ఫోటోలతో జ్ఞాపకాలను పంచుకుంటూ, ఓ హార్ట్ టచింగ్ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆనంద్ అందులో ఇలా రాశారు .. “ఈ పాట విని ఎమోషనల్ అయ్యాను. నాకు ఎప్పుడు కష్టం వచ్చినా అన్న విజయ్ ముందుండేవాడు. నా కలల్ని తనవిగా భావించి పోరాడేవాడు. తోబుట్టువుల ప్రేమ అంటే బయటకు చెప్పకుండా, లోపల నుంచి ఆప్యాయంగా ఉండే ప్రేమ అని నాకు మా అన్నని చూస్తే అర్థమయ్యింది. బహుశా ఈ పాట మా ఇద్దరిని ఊహించి రాసినట్టుంది. అన్న అంటే నీలా ఉండాలి” అంటూ విజయ్ ను ట్యాగ్ చేశాడు. ఈ పోస్టు చూసిన అభిమానులు ఆనంద్ సెన్సిటివిటీ పై ఫిదా అవుతున్నారు. అన్నదమ్ముల బంధాన్ని హత్తుకునేలా చూపిస్తూ వచ్చిన ఈ పాట, విజయ్-ఆనంద్ మధ్య ఉన్న ప్రేమ మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.
కాగా, ఈ నెలాఖరున కింగ్ డమ్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పై విజయ్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.
Read More : సమంత కొత్త వ్యాపార రంగంలోకి ఎంట్రీ

One thought on “అన్న అంటే నీలా ఉండాలి.. ఎమోషనలైన ఆనంద్ దేవరకొండ”
Comments are closed.