తమిళ సినీ పరిశ్రమలో ఇటీవల జరిగిన విషాద ఘటన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ను తీవ్రంగా కదిలించింది. ‘వేట్టువం’ సినిమా షూటింగ్ సమయంలో స్టంట్ మాస్టర్ రాజు ప్రాణాలు కోల్పోవడం అక్షయ్ మనసును కలచివేసింది. ప్రాణాలతో పాటే కెరీర్ను ప్రమాదాల్లో పెట్టే స్టంట్ మాస్టర్ల పరిస్థితిపై ఆయన బాధను వ్యక్తం చేశారు. ఈ సంఘటన అనంతరం అక్షయ్ కుమార్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. స్టంట్ మాస్టర్లకు కనీస భద్రత కావాలని భావించి.. తన స్వంత ఖర్చుతో 650 మంది స్టంట్ మాస్టర్లకు జీవిత బీమా (ఇన్సూరెన్స్ పాలసీ) చేయించారు. సినిమా పరిశ్రమలో ఎంతో అవగాహన, మానవతా దృక్పథంతో తీసుకున్న ఈ చర్యపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్టంట్ మాస్టర్లు సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తారని, వారు చేసే పనికి తగిన భద్రత ఉండాలని అక్షయ్ అభిప్రాయపడ్డారు. చాలామంది ప్రముఖులు స్టంట్ల కోసం డూప్స్ను వినియోగిస్తూ ఉన్నప్పటికీ, వారి భద్రతపై అలాంటి చొరవ చూపిన అక్షయ్ కుమార్ ప్రయత్నం పలువురికి ఆదర్శంగా మారుతోంది.
సినీ రంగంలో సాంకేతిక సిబ్బందిపై ప్రేమను, బాధ్యతను చాటిన అక్షయ్ కుమార్ ఈ కార్యం ద్వారా నిజమైన ‘హీరో’గా నిలిచారు.
Read More : హరిహర వీరమల్లు కారణంగా సంచలన నిర్ణయం తీసుకున్న నిధి

One thought on “మానవత్వాన్ని చాటుకున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్”
Comments are closed.