తీన్మార్ మల్లన్నకు నోటీసులు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తు ప్రగతిలో ఉండగానే రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటి వరకు 269 మంది బాధితుల వాంగ్మూలాలను సిట్ అధికారులు నమోదు చేసినట్టు సమాచారం. ఈ కేసులో బాధితులుగా రాజకీయ నాయకులు, గవర్నర్లు, హైకోర్టు న్యాయమూర్తులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, ఫార్మా, ఐటీ రంగాల ప్రముఖులు ఉన్నారు. అధికారుల అంచనాల ప్రకారం ఇప్పటివరకు సుమారు 4,200 ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించబడింది. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఫోన్ ట్యాప్ చేయబడినట్లు సిట్ గుర్తించింది. దీనితో ఆయనను విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. మల్లన్న రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు.

ఈ కేసులో మరిన్ని సంచలన వివరాలు బయటకు వచ్చే అవకాశముండగా, సిట్ దర్యాప్తు మరింత వేగంగా సాగుతోంది.

Read More : బడంగ్‌పేట్ కార్పొరేషన్ అధికారులపై సబితా ఇంద్రారెడ్డి అసహనం