సీఎం – ఆర్థిక సహాయం, ప్రాజెక్టులపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మరింత ఆర్థిక సహాయం అవసరమని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక వనరుల కొరతను ఎదుర్కొంటున్నదని, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు కేంద్రం నుంచి మద్దతు అవసరమని వివరించారు. సమావేశంలో చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులపై ఆర్థిక సహాయం కావాలన్న అంశాన్ని ముందుకు తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన వల్ల ఎదురైన ఆర్థిక నష్టాలను పరిగణనలోకి తీసుకుని, 16వ ఆర్థిక సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అంశంపై కూడా చర్చ జరిపారు. గోదావరి నదిలోని 200 టీఎంసీల వరద నీటిని బనకచెర్ల రెగ్యులేటర్‌కు మళ్లించడంతో రాయలసీమ ప్రాంతానికి ఉపశమనం కలుగుతుందని సీఎం వివరించారు. గోదావరి మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు హక్కు ఉందని స్పష్టం చేశారు.

ఇటు సీనియర్ టీడీపీ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా నియమించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్‌తో రాయలసీమలో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల అభివృద్ధిపై మాట్లాడారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల అంశంపై ఢిల్లీ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ కుమార్‌తో సమావేశమయ్యారు.

Read More : మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు మీడియా సమావేశం