కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో (RMC Kakinada) చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. విద్యార్థినులపై జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ మేరకు నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించారు. ఈ నెల 9న కళాశాల ప్రిన్సిపాల్‌కు బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినులు ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఆరోపణల మేరకు అదే రోజున అధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి మూడు రోజులపాటు విద్యార్థినుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. విచారణలో కళ్యాణ్‌తో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లపైనా ఆరోపణలు వచ్చాయి. విచారణ నివేదిక ఆధారంగా అధికారులు నలుగురిని వెంటనే సస్పెండ్ చేశారు. అంతేగాక, వారిపై పోలీసు కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను అధికారులు సీఎం చంద్రబాబుకు సమర్పించారు.
విద్యార్థినుల కథనం ప్రకారం.. ల్యాబ్ సహాయకులు శరీరాన్ని అసభ్యంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి అశ్లీల చేష్టలు చేసినట్లు, విధుల్లో ఉండగానే అసభ్య ఫోటోలు తీసి వాట్సాప్‌కు పంపించారని, బెదిరించారని, డబ్బులు డిమాండ్ చేశారని వెల్లడించారు. అంతర్గత విచారణలో 50 మంది విద్యార్థినులు మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో సిబ్బంది వ్యవహారం అసహనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు స్పష్టంగా తెలియజేశారు.. విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతే ప్రాధాన్యం అని, ఇలాంటి ఘటనలపై మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Read More : యజమానిని హత్య చేసి బంగారు నగలతో పరారైన పనిమనిషి

2 thoughts on “సీఎం – నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్, కేసు నమోదు”
Comments are closed.