మలేషియాలోని జోహోర్ రాష్ట్రం పులాయ్ నదిలో పోలీసు హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులతో సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. పౌర విమానయాన శాఖ ప్రకారం, మాక్ డ్రిల్ (ప్రయోగాత్మక వ్యాయామం) సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. మలేషియాతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలు కలిసి “మిత్సతోమ్ 2025” పేరుతో నిర్వహిస్తున్న బహుళ దేశాల అణు భద్రతా కసరత్తులో భాగంగా ఈ డ్రిల్ చేపట్టారు. ఈ క్రమంలో మలేషియాకు చెందిన ఎయిర్ బస్ AS355N హెలికాప్టర్, తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి, గెలాంగ్ పటాలోని మలేషియా మారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ (MMEA) జెట్టీ సమీపంలో ప్రమాదానికి గురై నదిలో కూలిపోయింది.
ప్రమాదం అనంతరం అత్యవసర సేవా బృందాలు వెంటనే స్పందించి పైలట్‌తో పాటు ఐదుగురిని రక్షించాయి. ప్రస్తుతం వారి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికార వర్గాలు పూర్తి సమాచారం కోసం దర్యాప్తు ప్రారంభించాయి.
READ MORE : ఏకాన్ స్మార్ట్ సిటీ రద్దు – ఆఫ్రికా కలల నగరం ఆశలలోకి

One thought on “మలేషియాలో పోలీసు హెలికాప్టర్ ప్రమాదం”
Comments are closed.