ఆఫ్రికా ఖండంలోని సెనెగల్ దేశంలో సంగీతకారుడు ఏకాన్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘ఏకాన్ స్మార్ట్ సిటీ’ ప్రాజెక్ట్ చివరికి రద్దయ్యింది. దాదాపు రూ.50,000 కోట్ల అంచనా వ్యయంతో 2020లో ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ, ఆరేళ్లు గడిచినా అభివృద్ధి కనిపించకపోవటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రాజెక్టు కోసం స్థానిక పేద ప్రజల భూములు స్వాధీనం చేసుకున్న అధికారులు, “ఈ నగరంతో జీవితాలు మారిపోతాయని” హామీలు ఇచ్చినప్పటికీ… అక్కడ ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క అసంపూర్ణ భవనం మాత్రమే కనిపిస్తోంది. 2026లో పూర్తవుతుందంటూ గ్రాఫిక్స్ వీడియోలు విడుదల చేసినా, ఆ భూములపై ఎలాంటి అభివృద్ధి జరగకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఒక ‘పిరమిడ్ స్కీమ్’ తరహా మోసం అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. దీనిపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో సెనెగల్ ప్రభుత్వం ప్రాజెక్టును అధికారికంగా రద్దు చేయనున్నట్లు, స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఇకపై ఆ భూముల్లో టూరిజం ప్రాజెక్ట్ చేపట్టే దిశగా సెనెగల్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Read More : Sheikh Hasina : భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం

2 thoughts on “ఏకాన్ స్మార్ట్ సిటీ రద్దు – ఆఫ్రికా కలల నగరం ఆశలలోకి”
Comments are closed.