హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు అసోసియేషన్ బాడీని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీతో టికెట్ల వివాదం నేపథ్యంలో ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి. గత మ్యాచ్ సందర్భంగా కార్పొరేట్ బాక్సులలోకి టికెట్లు ఇవ్వలేదని ఆరోపణల మధ్య, హెచ్‌సీఏ అధికారులు బాక్స్‌కు తాళం వేసిన ఘటన చర్చనీయాంశమైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన SRH యాజమాన్యం హైదరాబాద్‌ను వదిలే ఆలోచనలో ఉన్నామని స్పష్టం చేసింది.
ఈ వివాదంపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించగా, హెచ్‌సీఏ అధ్యక్షుడు SRH పై ఒత్తిడి తెచ్చినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. తాజా పరిణామాలతో హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Read More : Yash Dayal : ఎదురు ఫిర్యాదుతో వివాదం మలుపు

2 thoughts on “హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్”
Comments are closed.