ఐపీఎల్ 2025 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రధాన పేసర్ యశ్ దయాల్ ప్రస్తుతం తీవ్రమైన వ్యక్తిగత వివాదంలో చిక్కుకున్నాడు. “పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడు” అనే ఆరోపణలతో ఓ యువతి ఇందిరాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అదే సమయంలో ఆ యువతిని దొంగగా అభివర్ణించిన యశ్ దయాల్ ఘాటుగా ఎదురు ఫిర్యాదు చేసి సంచలనం రేపాడు.
ఘజియాబాద్‌కు చెందిన బాధితురాలు ఆదివారం ఇంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 69 కింద యశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకుంది. “తాము ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. యశ్ పెళ్లి వాగ్దానంతో నన్ను లైంగికంగా వాడుకున్నాడు” అని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా, ఈ విషయంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా జూన్ 21న ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొంది. ఈ ఆరోపణలపై యశ్ దయాల్ ఖండనతో పాటు ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్‌లో యువతిపై ఎదురు ఫిర్యాదు చేశారు. “2021లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, ఆపై యువతి నన్ను మోసగించింది. నా ఐఫోన్, లాప్‌టాప్ చోరీ చేసింది. వైద్య ఖర్చుల పేరుతో, షాపింగ్ కోసం డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదు” అని యశ్ తన ఫిర్యాదులో వివరించాడు. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని స్పష్టం చేశాడు.
తనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిన తర్వాత న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు యశ్ తెలిపాడు. ఆ యువతి తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరిపై కూడా కేసు నమోదు చేయాలని తాను తన మూడు పేజీల ఫిర్యాదులో కోరినట్టు వెల్లడించారు.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ కేసు రాసిన స్క్రిప్ట్‌ను తలపిస్తోంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదం ఎంతవరకు సాగుతుందో వేచి చూడాలి.
Read More : ఆర్సీబీ టాప్! ఐపీఎల్ జట్ల బ్రాండ్ విలువలు విడుదల

One thought on “Yash Dayal : ఎదురు ఫిర్యాదుతో వివాదం మలుపు”
Comments are closed.