టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనే విషయంపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన అనంతరం కుటుంబంతో కలిసి కోహ్లీ లండన్‌కి వెళ్లినట్లు ఇప్పటికే పలు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆయన నిజంగా అక్కడే ఉంటున్నారా? ఎక్కడ నివసిస్తున్నారు? అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇటీవల ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత ఊపందించాయి. ఓ క్రీడా చానల్‌లో జరిగిన చర్చలో ట్రాట్ మాట్లాడుతూ, “విరాట్ కోహ్లీ సెయింట్ జాన్స్ వుడ్‌లో లేదా దాని సమీపంలోనే ఉంటున్నాడా? మనం అతన్ని తిరిగి క్రికెట్‌కు రప్పించలేమా?” అంటూ వ్యాఖ్యానించారు. లండన్ వాయవ్య ప్రాంతమైన సెయింట్ జాన్స్ వుడ్ విలాసవంతమైన నివాస ప్రాంతంగా పేరుపొందింది. గతంలో కోహ్లీ నాటింగ్ హిల్ ప్రాంతంలో ఉంటున్నాడనే వార్తలు వచ్చినప్పటికీ, ట్రాట్ తాజా వ్యాఖ్యలతో కోహ్లీ కొత్త నివాసంపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ ప్రస్తుతం లండన్ నుంచే భారత జట్టు ప్రదర్శనను గమనిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించగా, కోహ్లీ సోషల్ మీడియా వేదికగా గిల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. “స్టార్ బాయ్” అంటూ గిల్‌ను అభివర్ణిస్తూ, “చరిత్రను తిరగరాస్తున్నావు… నువ్వు దీనికి అర్హుడివి” అని కొనియాడారు.
ఈ పరిణామాలన్నీ కోహ్లీ లండన్‌లోనే స్థిరపడ్డారనే ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కానీ అధికారికంగా ఆయన నివాసం ఎక్కడ అనేది ఇప్పటికీ స్పష్టంగా వెల్లడికాలేదు.
Read More : కెప్టెన్ కూల్ ధోనీకి అభిమానుల శుభాకాంక్షల వర్షం

One thought on “లండన్‌లోనే కోహ్లీనా? ట్రాట్ వ్యాఖ్యలతో ఊహాగానాలు”
Comments are closed.