ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం..

ఇండోనేసియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం శనివారం ఉధృతంగా పేలింది. ఈ పేలుడు ఫలితంగా 18 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడింది. అగ్నిపర్వతం బద్దలవడంతో పరిసర గ్రామాలు బూడిదతో పూర్తిగా కప్పుకుపోయాయి. జనజీవనం అతలాకుతలమైనట్టు అధికారులు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా పలు గ్రామాల్లో ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం అగ్నిపర్వతం చుట్టుప్రక్కల 5 కి.మీ. పరిధిలో హై అలెర్ట్ ప్రకటించారు. విమాన సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

Read More : ట్రంప్ సంచలనం: బ్రిక్స్‌కు మద్దతిస్తే 10% సుంకం విధిస్తాం!

One thought on “ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం..

Comments are closed.