విజయవాడకు చెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఆయనను హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు సమీక్ష చేస్తున్నారు. పూర్తి ఆరోగ్యవంతులయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. వంశీ ఆరోగ్యానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.
Read More : ప్లేట్లో బొద్దింక.. అనిత క్లారిటీ

One thought on “వల్లభనేని వంశీకి అస్వస్థత”
Comments are closed.