మాజీ మంత్రి కేటీఆర్‌పై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత పది ఏళ్లల్లో బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ అరిగోస పడిపోయిందని మండిపడ్డారు. “మీ పాలనతో రాష్ట్రం అభివృద్ధి బాట తప్పిపోయింది” అంటూ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ నిర్వహించిన చర్చపై స్పందించిన పొన్నం, “చర్చ అంటే ప్రెస్ క్లబ్‌లో పెట్టేస్తారా? అక్కడ రికార్డు కూడా ఉండదు. అసలు చర్చకు వస్తే శాసనసభలోకి తీసుకురండి. కేసీఆర్‌ను కూడా తీసుకొని రండి. సభే సరైన వేదిక” అని స్పష్టం చేశారు.
ఇంకా కొనసాగిస్తూ, “ఎక్కడ చర్చ జరగాలి అన్నదీ మీకే తెలియకపోతే ఎలా? ఇలా చర్చల పేరుతో వీధుల్లో కొట్టుకుందామంటే ఎలా? ప్రజాస్వామ్యంలో అలా కుదరదు. సభలు, వ్యవస్థలు ఉండే ఉన్నాయి” అని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Read More : బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య: స్నేహితుల అవమానమే కారణం?

One thought on “మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్…”
Comments are closed.