భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. జ్వరంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, సోడియం స్థాయిలు తగ్గడంతో గురువారం హుటాహుటిన హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఆయనను చేర్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన కేసీఆర్ ఆరోగ్యం స్థిరంగా మారడంతో, శనివారం ఉదయం వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి నేరుగా ఆయన తన నివాసమైన నందినగర్‌కు వెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యుల ప్రకారం, కేసీఆర్ రక్తంలో చక్కెర, సోడియం స్థాయిలు ఇప్పుడు సాధారణంగా ఉన్నాయని తెలిపారు. జ్వరం తగ్గి శరీర పరిస్థితి మెరుగైన నేపథ్యంలో, ఆయన నిన్నటి నుంచే ఉత్సాహంగా పార్టీ నేతలతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరంగా పూర్తి భద్రతలో ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు.
Read More : Godavari : 20 అడుగులకు చేరిన నీటిమట్టం
