బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా నీరసం, జ్వరంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించగా, షుగర్ స్థాయులు అధికంగా, సోడియం స్థాయులు తక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, బలహీనత పూర్తిగా తగ్గేంతవరకు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. కేసీఆర్‌ను తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎం.వి.రావు సలహా మేరకు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రికి వెళ్లి తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.
Read More : దివ్యాంగుల హక్కుల కోసం ఆగస్టు 13న మహాగర్జన

2 thoughts on “కేసీఆర్ అస్వస్థత – యశోద ఆసుపత్రిలో చికిత్స”
Comments are closed.