భారత యువ క్రికెటర్, ప్రస్తుత భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెస్ట్ క్రికెట్‌కి సంబంధించిన విలువైన విషయాలను ఈ వీడియోలో గిల్ సూటిగా, స్పష్టంగా వెల్లడించారు. “టెస్ట్ క్రికెట్ అనేది ఓపికతో ఆడాల్సిన ఆట. తొందరపడి అవుట్ అయితే, మిగతా సమయాన్ని కేవలం బయట కూర్చొని గడిపేయాల్సి ఉంటుంది. క్రీజులో ఎక్కువసేపు ఉండగలిగితేనే పరుగులు సాధ్యమవుతాయి. ప్రతి బంతికి గాలిలో కొట్టడం కాకుండా గ్రౌండ్ షాట్లతోనే రన్లు సాధించాలి” అని గిల్ వివరించారు. అంతేకాకుండా, బౌలర్ తక్కువ నాణ్యత గల బంతులు విసిరినపుడు – ప్రత్యేకించి ఫుల్ టాస్, షార్ట్ పిచ్ వంటి వాటిపై దూకుడుగా ఆడి జట్టు స్కోరు పెంచాలన్నారు. ఆటగాడు తన బాధ్యతను గుర్తుంచుకుని జట్టును నిరాశపర్చకుండా ఆడాలన్నది గిల్ ప్రధాన సందేశంగా కనిపించింది.
ఇతని ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న వయస్సులోనే క్రికెట్‌పై గిల్లుకు ఉన్న అవగాహన, సమగ్రమైన ఆలోచన శైలిపై అభిమానులు స్పందిస్తున్నారు. ప్రస్తుతం జట్టు నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న గిల్, టెస్ట్ ఫార్మాట్ పట్ల చూపుతున్న గౌరవం ఈ వీడియో ద్వారా మరింత స్పష్టమైంది.
Read More : వన్డే మ్యాచ్ మధ్యలో పాము హల్చల్

One thought on “శుభ్‌మన్ గిల్ పాత వీడియో వైరల్”
Comments are closed.