మహిళా టీచర్ లైంగిక వేధింపులు…

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రముఖ పాఠశాలలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. 11వ తరగతి చదువుతున్న బాలుడిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న మహిళా టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2023లో జరిగిన పాఠశాల వార్షికోత్సవం సమయంలో గ్రూప్ డ్యాన్స్ కోసం సిద్ధం చేస్తున్న సమయంలో మహిళా టీచర్, విద్యార్థితో సన్నిహితంగా మాట్లాడుతూ పరిచయం పెంచుకుంది. తర్వాత “టీచర్లు-విద్యార్థుల మధ్య ఇలాంటి విషయాలు సహజం” అంటూ నమ్మించి పలు ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసుకెళ్లింది.

అంతేకాకుండా బాలుడికి మద్యం తాగించి, ఆందోళనకు గురైన సమయంలో నిద్రలేని రాత్రులు ఉండవు అంటూ మందులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా కుమారుడి ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు విచారణ జరిపి అసలైన కారణాన్ని తెలుసుకున్నారు. కుమారుడు త్వరలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయబోతున్నాడు కనుక విషయాన్ని బయట పెట్టకుండానే మౌనంగా ఉండాలని తల్లిదండ్రులు భావించారు. కానీ బోర్డు పరీక్షల తర్వాత కూడా టీచర్ మళ్లీ విద్యార్థిని కలవడానికి ప్రయత్నించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మహిళా టీచర్‌ను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేసు ముంబైలో సంచలనం సృష్టిస్తోంది.

Read More : హసన్ జిల్లాలో గుండెపోటులతో 23 మంది యువకుల మృతి…

One thought on “మహిళా టీచర్ లైంగిక వేధింపులు…

Comments are closed.