దిల్లీలో బ్రిటన్ మహిళపై అత్యాచారం – ఇద్దరు నిందితులు అదుపులో

British wOMEN

దిల్లీ: దిల్లీలో బ్రిటన్‌కు చెందిన ఒక మహిళపై జరిగిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, ఆ మహిళ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో స్నేహం చేసి కలుసుకునేందుకు ఆమె దిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో మహిపాల్‌పూర్ ప్రాంతంలోని ఓ హోటల్‌కు వారు వెళ్లారు. అక్కడే సదరు వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాకుండా, అదే హోటల్‌లో లిఫ్ట్‌లో ఉన్న సమయంలో మరో వ్యక్తి ఆమెను అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.

ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తక్షణమే స్పందించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తిన ఈ సంఘటనపై అధికారులు పలు చర్యలు చేపట్టారు.

Read More

One thought on “దిల్లీలో బ్రిటన్ మహిళపై అత్యాచారం – ఇద్దరు నిందితులు అదుపులో

Comments are closed.