మహా న్యూస్ వివరణ: “వ్యూస్ కోసం Thumb Nails..

తమ చానల్‌లో వచ్చిన వివాదాస్పద వీడియోలపై మహా న్యూస్ ప్రతినిధి అజిత్ స్పందించారు. “వ్యూస్ కోసం కొన్ని థంబ్‌నెయిల్స్ అలా పెట్టడం జరుగుతుంది. ఈ విషయం సంస్థ యాజమాన్యానికి కూడా తెలియదు” అని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు అనుకోకుండా జరిగి ఉంటాయని, తప్పక ముందు తెలియజేసి ఉంటే తాము వెంటనే స్పందించి వాటిని తొలగించే వాళ్లమన్నారు. “ఎవరైనా నన్ను ఒకసారి ఫోన్ చేసి చెప్పి ఉంటే, ఆ వీడియోలు అప్పుడే తొలగించే వాళ్లం. అనవసరంగా తప్పుడు అర్థాలపై చర్చ జరగకూడదు” అని అజిత్ స్పష్టం చేశారు.

తాము బాధ్యతగల మీడియా సంస్థగా, ఏ విషయంలోనైనా తక్షణమే స్పందించి సరిదిద్దే విధంగా ఉంటామని ఆయన వివరించారు. థంబ్‌నెయిల్స్ విషయంలో సంబంధిత బృందానికి తగిన సూచనలు ఇస్తామని, ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read More : హరీశ్ రావు తీవ్ర విమర్శలు

One thought on “మహా న్యూస్ వివరణ: “వ్యూస్ కోసం Thumb Nails..

Comments are closed.