ఏపీ లిక్కర్ కేసులో మరో ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తాజాగా ఈ కేసులో సిట్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్‌ఐటీ విచారణలో కీలకంగా భావిస్తున్న ఏ35 బాలాజీ, ఏ36 నవీన్‌లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన డబ్బులను తరలించినట్లుగా ఆరోపణలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన సిట్, ఇప్పుడు బాలాజీ, నవీన్‌ల అరెస్టుతో మరిన్ని కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ ఇద్దరినీ విచారించేందుకు ప్రత్యేక బృందం ఇండోర్‌కు చేరుకుని, అవసరమైన న్యాయ ప్రక్రియల తర్వాత వారిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని తెలిపారు.

read More : తిరుపతిలో కారు నుంచి ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం