మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఆయన కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై, ఈ దుర్ఘటనలో ఆయన తండ్రి సీపీ చాకో మృతి చెందారు. షైన్ టామ్‌చాకో సహా ఇతర కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఘటన గురించి వివరించిన షైన్ టామ్ చాకో… “ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. కళ్లు మూసి తెరిచేలోపు అన్నీ అయిపోయాయి” అని చెప్పారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం తాను కారులో వెనుక సీటులో నిద్రించుకుంటూ వెళ్లాడని, నిద్రలోంచి మెలకువ వచ్చినప్పుడల్లా తండ్రితో మాట్లాడానని, మళ్లీ నిద్రలోకి వెళ్లిపోయానని తెలిపారు.
అయితే ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో ఉలిక్కిపడి లేచినపుడు కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందని, “ఆ సమయంలో ఏమాత్రం అర్థం కాలేదు, అసలు మేము రోడ్డుపై పడిపోయామన్న విషయం కూడా అప్పుడు తెలియలేదు” అని వివరించారు. తండ్రిని ఎన్నిసార్లు పిలిచినా స్పందించకపోవడం, తల్లి షాక్‌లోకి వెళ్లడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. “ఇంతవరకూ రోడ్డు ప్రమాదాలు చూసినవే కానీ, ఇలా ప్రత్యక్షంగా అనుభవించడం ఇదే తొలిసారి. ఆ సమయంలో దయచేసి మాకు సహాయం చేయండి అని కేకలు వేసే పరిస్థితిలో ఉన్నాం” అని షైన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాద సమయంలో తాను ఆరోగ్య కారణాలతో తీసుకుంటున్న మందుల ప్రభావంతో గాఢనిద్రలో ఉన్నానని చెప్పారు. ఆ రోజు కూడా అదే మందులు తీసుకున్న కారణంగా ఏం జరిగిందన్న విషయమై స్పష్టత లేదన్నారు.
ఈ ఘటనలో తాను తీవ్ర గాయాలపాలై దాదాపు 30 కుట్లు వేసుకున్నట్టు తెలిపారు. తల్లి, సోదరుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారని వివరించారు. తండ్రి మృతితో తమ కుటుంబం ఇప్పటికీ ఆ విషాదాన్ని మరిచిపోలేక పోతుందని, ఇప్పటికీ ఆ ఉదంతం తలుచుకుంటే గుండె నొప్పుతో ఉందన్నారు.
Read More : సమంతా, శ్రీలీలా గ్లామర్‌తో మెరిశారు:

One thought on “రోడ్డు ప్రమాదంపై షైన్ టామ్ చాకో భావోద్వేగ స్పందన”
Comments are closed.