కర్ణాటకలో ఇటీవల కలకలం రేపిన ఐదు పులుల మృతి కేసు మిస్టరీకి తెరపడింది. చామరాజనగర జిల్లా మలెమహదేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో తల్లి పులితోపాటు నాలుగు కూనలు మృతిచెందిన ఘటనపై అటవీశాఖ జరిపిన లోతైన దర్యాప్తులో పులుల మరణానికి మానవ హస్తమే కారణమని స్పష్టమైంది. ఈ కేసులో మాదురాజు అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా బయటపడగా, అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పగతో చేసిన ప్రాణహత్య
తన పెంపుడు ఆవు “కించి”ను ఓ పులి వేటాడి చంపిన నేపథ్యంలో ఆవేదనకు గురైన మాదురాజు, పులిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు కోనప్ప, నాగరాజులతో కలిసి కుట్ర రూపొందించి, పులి చంపిన ఆవు మాంసానికి విషం కలిపి అటవీప్రాంతంలో వదిలాడు. ఆ మాంసాన్ని తిన్న తల్లి పులి, కూనలు ఐదుగురూ అక్కడికక్కడే మృతి చెందారు.
అటవీశాఖ అప్రమత్తం
ఈ ఘటనను సవాలుగా తీసుకున్న అటవీశాఖ అధికారులు ఆధారాలను సేకరించి, నిందితులచే జరగిన కుట్రను విప్పారు. మూడు మందినీ అరెస్ట్ చేసి మంగళవారం ‘అరణ్య భవన్’కు తరలించినట్లు తెలిపారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
సీఎం స్పందన
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. వెంటనే నివేదిక సమర్పించాలని, నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేకు ఆదేశాలు జారీ చేశారు. పులుల హత్య ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వన్యప్రాణి సంరక్షణ సంఘాలు, దోషులకు గట్టిన శిక్ష పడాలన్నారు.
ఈ ఘటన వన్యప్రాణుల రక్షణలో మానవ చర్యల ప్రభావాన్ని బట్టబయలు చేసింది. అధికారుల అవగాహనతోనే కేసు పరిష్కారమవుతుండటంతో, ఆత్మీయంగా పెంచిన జంతువులపై జరిగే మానవ ప్రతీకార చర్యలు ఎంతవిధ్వంసకరమై ఉండొచ్చో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.
Read More : Medical Report : టీఎంసీ నేత అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా కలకలం

One thought on “కర్ణాటకలో ఐదు పులుల మృతి కేసు పరిష్కారం…”
Comments are closed.