చైనాలో వర్షాల బీభత్సం: గుయిజౌ నగరాలు జలదిగ్బంధం

చైనాలో భారీ వర్షాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో, దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజల జీవనం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా గుయిజౌ ప్రావిన్స్‌లోని రోంగ్జియాంగ్ పట్టణం సహా కొన్నిరాజధాని ప్రాంతాలు నీటమునిగాయి. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు పడుతున్నప్పటికీ, శుక్రవారం నాటికి వర్షపాతం రికార్డు స్థాయికి చేరుకోవడంతో వరద పరిస్థితి మరింత విషమంగా మారింది.

రోంగ్జియాంగ్ పట్టణంలోని రహదారులు, మార్కెట్‌లు, నివాస ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కొన్నిచోట్ల నీటి మట్టం తొమ్మిది అడుగులకు పైగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు, వరదల ప్రభావంతో విద్యుత్, టెలికమ్యూనికేషన్ సేవలు కూడా అంతరించిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోయాయి, వాహనాలు కొట్టుకెళ్లాయి. గుయిజౌలో కూడా పరిస్థితి అంతే విషమంగా ఉంది. హవాలీ, రూరల్ ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రత్యేక బోట్లు, సహాయక బృందాలను రంగంలోకి దించారు.

Read More : ఇజ్రాయెల్‌పై ఖమేనీ వ్యాఖ్యలు.. అమెరికా చావుదెబ్బ తిన్నదా?

One thought on “చైనాలో వర్షాల బీభత్సం: గుయిజౌ నగరాలు జలదిగ్బంధం

Comments are closed.