సచివాలయం ఎదుట రైతుల ఆందోళన

హైదరాబాద్ సచివాలయం ఎదుట మహబూబ్‌నగర్ జిల్లా రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేసముద్ర మండలానికి చెందిన నారాయణపూర్ గ్రామ రైతులు, తమ భూములకు సంబంధించిన పాస్ పుస్తకాల్లో పేర్లను “అడవి”గా నమోదు చేశారని, వెంటనే పేరు సరిచేసి అసలైన రైతుల పేరిట పట్టాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు సచివాలయం ఎదుట ధర్నాకు దిగిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

రైతులు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 1,800 ఎకరాల్లో 700 ఎకరాలకు మాత్రమే పట్టాలు జారీ చేశారని, మిగిలిన 1,100 ఎకరాల భూములకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాస్ పుస్తకాలలో “అడవి”గా నమోదైన భూములు తాము సాగుచేస్తున్న భూములే అని స్పష్టం చేస్తూ, తమకు రైతులుగా గుర్తింపు ఇవ్వాలని, తగినట్టుగా పేర్లను సరిదిద్దాలని కోరారు. భూమి హక్కుల కోసం సాగిస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం గౌరవించాలని, తక్షణమే పట్టాలు జారీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Read More : కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు ఘాటు విమర్శలు

One thought on “సచివాలయం ఎదుట రైతుల ఆందోళన

Comments are closed.