బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు ప్రయాణికుడిపై దాడి

ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ వందే భారత ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో, సీటు ఇవ్వలేదన్న కారణంతో ఆయన అనుచరులు ఒక ప్రయాణికుడిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే, ఎంఎల్ఎ రాజీవ్ సింగ్ ప్రయాణిస్తున్న కోచ్‌లో ఆయన అనుచరులు ఓ సీటు కోసం ఓ సాధారణ ప్రయాణికుడిని గొడవపడ్డారు. సీటు ఇవ్వడంలో ఆలస్యం అయ్యిందన్న ఆగ్రహంతో ఆ ప్రయాణికుడిని చితకబాదారు. ఘటన సమయంలో అక్కడి ఇతర ప్రయాణికులు మౌనంగా ఉండిపోయారు. అనంతరం కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వందే భారత్ రైళ్లను ప్రజల సౌకర్యార్థం ఉపయోగిస్తుండగా, ఇలా ప్రజాప్రతినిధుల అనుచరులు సామాన్యులపై దాడికి దిగడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

Read More : ప్రధాని మోదీపై శశి థరూర్ ప్రశంసలు

One thought on “బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు ప్రయాణికుడిపై దాడి

Comments are closed.