టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి శృతి హాసన్ తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ ధైర్యంగా పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కాస్మెటిక్ సర్జరీల విషయంలో ఆమె స్పందన స్పష్టంగా ఉండేది. తాజాగా మరోసారి తన ముక్కుకు సంబంధించి జరిగిన ప్లాస్టిక్ సర్జరీపై స్పందించిన ఆమె, ఆ నిర్ణయం వెనక ఉన్న కారణాలను వివరించారు.
“నాకు టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నచ్చేది కాదు. అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే, ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా వాడాను” అని శృతి హాసన్ తెలిపారు. ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం తనకు లేదని, ఇలాంటివి పలు సందర్భాల్లో తాను బహిరంగంగానే చెప్పానని ఆమె పేర్కొన్నారు.
“ఇలాంటి విషయాలను బయటకు చెప్పకపోవడం కొందరికి అభిరుచిగా ఉండొచ్చు. వారి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. అదే విధంగా, నా అభిప్రాయాన్ని కూడా ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది. అది తప్పు కాదని నమ్ముతాను” అని శృతి వివరించారు.
తన శరీరం గురించి నిర్ణయం తీసుకునే హక్కు తనకే ఉందని స్పష్టం చేసిన ఆమె, అవసరమైతే భవిష్యత్తులో ఫేస్‌లిఫ్ట్ చేయించుకునే అవకాశం ఉందని తెలిపారు. “ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఇతరులకు ఇబ్బంది కలగనంతవరకూ, ఎవరూ నా శరీరం గురించి నేను తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించాల్సిన అవసరం లేదు” అని ఆమె అన్నారు. ప్రస్తుతం శృతి హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకానుంది.
read More : జూలై 24: పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం

One thought on “శృతి హాసన్ ప్లాస్టిక్ సర్జరీపై స్పందన”
Comments are closed.