డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ అరెస్టు

డ్రగ్స్ కేసులో ప్రముఖ తమిళ నటుడు శ్రీకాంత్‌ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే ఆయనకు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేశారు. తాజాగా విచారణ సందర్భంగా పోలీసులు శ్రీకాంత్‌ను అధికారికంగా అరెస్టు చేసి, బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు.

నటుడు శ్రీకాంత్‌పై, మాజీ డీఎంకే నాయకుడి ద్వారా డ్రగ్స్‌ను కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును ఇప్పటికే పోలీసులు విచారణకు తీసుకున్నారు. డ్రగ్స్ మాఫియాతో సినీ ప్రముఖుల సంబంధాలపై తమిళనాడులో పోలీసులు కట్టుదిట్టమైన దర్యాప్తు చేపట్టారు.

ఇక శ్రీకాంత్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారన్నది, ఆయనపై నమోదైన కేసు విచారణ ఎలా సాగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.

Read More : శృతి హాసన్ ప్లాస్టిక్ సర్జరీపై స్పందన

One thought on “డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ అరెస్టు

Comments are closed.