విశాఖపట్నంలో జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందజేసి, మంగళగిరి శాలువాతో సత్కరించిన మంత్రి లోకేష్, అనంతరం గవర్నర్ కు తన పాదయాత్ర అనుభవాలతో కూడిన “యువగలం” అనే పుస్తకాన్ని బహుకరించారు.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి ముస్తాబవుతోంది. శనివారం (జూన్ 21) జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 5 లక్షల మంది పాల్గొననున్న ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు లక్ష్యంగా మారింది.
కాగా, ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న నేపథ్యంలో యోగా మహోత్సవానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ నగరాన్ని ప్రత్యేకంగా అందంగా ముస్తాబు చేశారు. అధికారులు ఏర్పాట్లను ఎడతెరిపిలేకుండా పర్యవేక్షిస్తూ వేడుకలను విజయవంతం చేయాలని కృషి చేస్తున్నారు.
Read More : ఏపీలో వర్షాల కోసం విశేష పూజలు

One thought on “విశాఖలో యోగా వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్”
Comments are closed.