ఉత్తరప్రదేశ్‌: బ్రిడ్జికి అడ్డుగా భవనం

లక్నో నగరంలోని కృష్ణనగర్-కేసరిఖేడ క్రాసింగ్ వద్ద రూ.74 కోట్ల వ్యయంతో నిర్మించబడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌కు నిర్మాణ మధ్యలోనే అడ్డుగా రెండు అంతస్తుల భవనం ప్రత్యక్షమైంది.

ఈ విస్తరణలో సగం వరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాతనే ఇంజనీర్లు ఈ భవనాన్ని గుర్తించడంతో వారు అయోమయంలో పడ్డారు. గత మూడు నెలలుగా నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. ఏ నిర్ణయం తీసుకోవాలో తర్జన భర్జనలో ఉన్నామని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం స్థానిక అధికారులు, సంబంధిత శాఖలు భవనాన్ని ఎలా తొలగించాలి, లేదా మార్గాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు.

Read More : విశాఖలో మోదీ యోగా పర్యటన